అక్షయ పాత్ర ప్రతిష్ఠానము వృద్ధ మహిళలకు పౌష్టికాహారం అందిస్తోంది. ఒంటరిగా జీవించె మహిళల ఆరోగ్యానికి పౌష్టికాహారం ఎంతో అవసరమైనది అందుకే వారు వృద్ధాప్యము వయసులో గౌరవంగా, ఘనతగా జీవించేలా పౌష్టికాహారం అందించే పథకాన్ని అక్షయ పాత్ర ప్రతిష్ఠానము యోజించింది.
మహిళలకు రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన భోజనం అందించే పథకం
భారతదేశంలో 10% మంది మహిళలు తమ ఇంటికి ఆధారమైన భర్త లేకుండానే జీవిస్తున్నారు.
వీరిలో ఎక్కువ మంది మహిళలు ఒంటరివారే. చురుకైన స్త్రీ ఆరోగ్యంగా ఉండటానికి రోజుకు 1200-1800 కేలరీలు ఉన్న ఆహారమును తీసుకోవాలి.
పౌష్టికాహారం మరియు తాజా ఆహారం తీసుకోవడం ద్వారా వారు ఆరోగ్యంగా ఉండగలరు. మహిళలు ఆత్మగౌరవంతో, స్వావలంబనతో జీవించాలంటే ఆరోగ్యంగా ఉండాలి.
మీరు కూడా విరాళం ఇవ్వడం ద్వారా ఈ యోజనకు మీ మద్దతు మరియు ప్రోత్సాహాన్ని అందించగలరు
ఒక స్త్రీకు చెందె ఒక్క భోజనానికి 25/- ఖర్చు చేస్తుంది. ఈ మంచి ప్రయత్నానికి మద్దతుగా మీరు విరాళం ఇవ్వవచ్చు. మీరు ఇవ్వగల విరాళంతో వృద్ధురాలు, గర్భిణి, భర్తను కోల్పోయిన స్త్రీలు పౌష్టికాహారాన్ని అందుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
ఈ పథకం మరింత మంది అర్హులైన మహిళా లబ్ధిదారులకు చేరుకోవడానికి మీ మద్దతు మరియు ప్రోత్సాహం చాలా అవసరం. ఈ రోజే ఈ పథకానికి మీ మద్దతు ఇవ్వండి. మీరు చేసే విరాళానికి కూడా పన్ను మినహాయింపు ఉంటుంది.
ఈ రోజే ఈ మంచి కార్యానికి మద్దతు ఇవ్వండి.