పాఠశాల పిల్లల కలలను నిజం చేసేందుకు ఈ మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని మద్దతు ఇవ్వండి.
విద్య, ఆహారం, ఆరోగ్యం
పాఠశాలలకు ఆహార పథకం ఎందుకు? ఆకలి మరియు పేదరికం కారణంగా పాఠశాలలలో హాజరు తగ్గుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అక్షయ పాత్ర ప్రతిష్ఠానము పిల్లలకు రుచికరమైన, పౌష్టికాహారాన్ని అందించడం ద్వారా వారి చదువులో సహాయపడుతుంది. పిల్లలు వారి కలలను నెరవేర్చడంలో ఈ పథకం గొప్ప పాత్ర వహిస్తోంది.
మీరు ఈ యోజనకు ఎందుకు మద్దతు ఇవ్వాలి?
మీ సహాయం పాఠశాలకు వెళ్లే పిల్లల భవిష్యత్తును మార్చగలదు. ఈ పథకాన్ని మరింత విస్తృతంగా విస్తరించడానికి మాకు మీ ప్రోత్సాహం మరియు మద్దతు అవసరం.
కేంద్ర ప్రభుత్వ ప్రధాన మంత్రి పోషణ అభియాన్ కార్యక్రమం అమలు భాగస్వామిగా ఉన్న అక్షయ పాత్ర ప్రతిష్ఠానము 2000 సంవత్సరం నుండి పాఠశాలలకు ఆహారం పథకాన్ని విజయవంతంగా కొనసాగిస్తోంది.
అక్షయ పాత్ర ప్రతిష్ఠానము యొక్క మైలురాళ్ళు
1] లబ్ధిదారుల పిల్లలకు 4 బిలియన్ విలువైన భోజనం అందించబడింది
2] మేము 2.25 మిలియన్ పిల్లలకు భోజనం అందిస్తున్నాము
3] 23,000 పాఠశాలలకు ఆహారం సరబరాజు చేయబడుతున్నది
4] 16 రాష్ట్రాలు మరియు 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు విస్తరించింది